కరోనా ఆస్పత్రిలో ప్రమాదం: 15 మంది మృతి

తాజా వార్తలు

Updated : 25/04/2021 12:17 IST

కరోనా ఆస్పత్రిలో ప్రమాదం: 15 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది రోగులు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ మేరకు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 

అల్‌ ఖతిబ్‌ ఆస్పత్రికి చెందిన వైద్యుడు సభా అల్‌ కుజీ మాట్లాడుతూ.. ‘ప్రమాదంలో బాధితులు ఎంత మంది ఉన్నారనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ, ఘటన జరిగిన ప్రదేశంలో చాలా వరకు కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయి’ అని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో 120 మంది రోగులు ఉండగా.. దాదాపు 90 మందిని భద్రతా సిబ్బంది రక్షించినట్లు మరో వైద్యుడు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్‌లో పేలుడు చోటుచేసుకోవడమే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. 

కాగా, ఇరాక్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం సగటున ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రజలందర్నీ వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని కోరుతోంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని