Black day: దిల్లీకి భారీగా తరలిన రైతులు

తాజా వార్తలు

Published : 23/05/2021 16:13 IST

Black day: దిల్లీకి భారీగా తరలిన రైతులు

చండీగఢ్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన కార్యక్రమం చేపట్టి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 26న ‘బ్లాక్‌ డే’ పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హరియాణలోని కర్నల్‌ జిల్లా నుంచి పెద్దఎత్తున రైతులు దిల్లీకి తరలివెళ్లారు. భారత్‌ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత గుర్నామ్‌ సింగ్‌ నేతృత్వంలో వందలాది వాహనాల్లో వీరంతా ఆదివారం దిల్లీకి బయల్దేరారు. ‘బ్లాక్‌ డే’ నిరసనలో భాగంగా వారంపాటు దిల్లీ సరిహద్దుల్లో సామూహిక భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. పంజాబ్‌ నుంచి కూడా భారీగా రైతులు బయల్దేరారు.

ఓ వైపు దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్నా రైతులు తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో కొవిడ్‌ వ్యాప్తికి ఆందోళన చేస్తున్న రైతులు కారణమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను గుర్నామ్‌సింగ్‌ ఖండించారు. ప్రభుత్వమే సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలు గుమిగూడడానికి కారణమయ్యిందని గుర్తుచేశారు. ఇప్పుడు తమను తప్పుబట్టడం సరికాదన్నారు. ఇప్పటికీ తాము ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. ఇదే విషయమై 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సైతం ప్రధాని మోదీకి శుక్రవారం లేఖ రాసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని