‘అప్పటివరకు ఉద్యమిస్తాం’

తాజా వార్తలు

Published : 11/03/2021 01:27 IST

‘అప్పటివరకు ఉద్యమిస్తాం’

ముజఫర్‌నగర్‌: ఎన్డీయే ప్రభుత్వ పదవీ కాలం ముగిసే వరకు దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని రైతు నాయకుడు నరేంద్ర తికాయిత్‌ తెలిపారు. ప్రస్తుతం బీకేయూకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ తికాయిత్‌ సోదరుడే నరేంద్ర తికాయిత్. రైతుల ఆందోళనల గురించి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇతర ఆందోళనలను అణచివేసిన తరహాలో రైతుల ఉద్యమాన్ని అరికట్టాలనుకునే అపోహ నుంచి ప్రభుత్వం తేరుకోవాలని హితవు పలికారు. 

‘ప్రభుత్వం వివిధ వ్యూహాలను అనుసరించి గతంలో ఇతర ఆందోళనలను అణచివేసింది. ఇప్పడు రైతుల ఉద్యమాన్ని కూడా అలాగే చేయాలనే అపోహలో ఉంది. నేను ముజఫర్‌నగర్‌లో ఉన్నప్పటికీ.. నా కళ్లు దిల్లీ సరిహద్దుల్లోనే ఉన్నాయి. తరచూ వెళ్లి బీకేయూ మద్దతుదారుల్ని కలిసి వస్తున్నాను. ఈ నిరసనల్ని ప్రభుత్వం అణచివేయలేదు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయి. మోదీ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర సంవత్సరాల గడువు ఉంది. ఆ గడువు ముగిసే వరకు మేం పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్రం పంటలకు మద్దతు ధర ఉంటుందని చెబుతోంది. కానీ మరి ఆ విషయంలో రాత పూర్వక హామీ ఎందుకు ఇవ్వలేకపోతోంది’ అని ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని