close

తాజా వార్తలు

Published : 01/12/2020 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతన్నలతో కేంద్రం చర్చలు విఫలం!

కమిటీకి కేంద్రం ప్రతిపాదన.. తోసిపుచ్చిన రైతులు

దిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చట్టాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి రైతు సంఘాల ప్రతినిధులు ససేమిరా అన్నారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టంచేశారు. కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని తోసిపుచ్చారు.

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 35 రైతు సంఘాల ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం కేంద్రమంత్రులు సమావేశమయ్యారు. విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ చర్చల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో పాటు ఇతర కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు అంశాన్ని కేంద్రం రైతు ప్రతినిధుల ముందుంచగా.. వారు దాన్ని తోసిపుచ్చారు. కమిటీ ఏర్పాటు సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో కొలిక్కి రాకుండానే చర్చలు ముగిశాయి. గురువారం మరోసారి రైతులతో కేంద్రం చర్చలు జరపనుంది. అప్పటి వరకు శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టంచేశారు. చర్చల నేపథ్యంలో విజ్ఞాన్‌ భవన్‌ వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. రైతు సంఘాల ప్రతినిధులతో భేటీకి ముందు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, తోమర్‌, గోయల్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు భేటీ అయ్యారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని