Facebook: మొన్న ట్విటర్‌.. నేడు ఫేస్‌బుక్‌: రాహుల్‌ పోస్ట్‌ తొలగింపు

తాజా వార్తలు

Published : 20/08/2021 23:46 IST

Facebook: మొన్న ట్విటర్‌.. నేడు ఫేస్‌బుక్‌: రాహుల్‌ పోస్ట్‌ తొలగింపు

దిల్లీ: తమ పాలసీని ఉల్లంఘించారన్న కారణంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన పోస్ట్‌ను ఫేస్‌బుక్‌ తొలగించింది. దిల్లీలో అత్యాచారానికి గురైన తొమ్మిదేళ్ల  బాలికకు చెందిన కుటుంబ సభ్యుల ఫొటోలను పోస్ట్‌ చేశారన్న కారణంతో ఇప్పటికే రాహుల్‌ ఖాతాపై ట్విటర్‌ కొరడా ఝులిపించగా.. తాజాగా ఫేస్‌బుక్‌ సైతం చర్యలు చేపట్టింది. నిబంధనల ఉల్లంఘన కింద ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో రాహుల్‌ చేసిన సదరు పోస్ట్‌ను ఫేస్‌బుక్‌ డిలీట్‌ చేసింది. ఈ మేరకు రాహుల్‌ గాంధీ సహా, జాతీయ పిల్లల హక్కుల కమిషన్ (ఎన్‌సీపీసీఆర్‌)కు సమాచారం ఇచ్చింది.

ఇటీవల అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శ సందర్భంగా వారి ఫొటోలను రాహుల్‌ గాంధీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. చివరికి అది రాహుల్‌ ట్విటర్‌ ఖాతాను లాక్‌ చేసే వరకూ వెళ్లింది. కుటుంబ సభ్యుల అనుమతి పత్రం సమర్పించడంతో ఖాతాను ట్విటర్‌ పునరుద్ధరించింది. ఇదే తరహాలో భారతీయ చట్టాలకు లోబడి, తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న రాహుల్‌ పోస్ట్‌ ఉన్నందున తొలగించినట్లు ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని