దుబాయ్- భారత్‌ విమానాలు తాత్కాలిక రద్దు

తాజా వార్తలు

Published : 23/04/2021 01:05 IST

దుబాయ్- భారత్‌ విమానాలు తాత్కాలిక రద్దు

దుబాయ్‌: దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌- భారత్‌ మధ్య విమాన రాకపోకలను ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం (ఏప్రిల్‌ 25) నుంచి 10 రోజుల పాటు సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆ తరువాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. భారత్‌పై ఇప్పటికే బ్రిటన్‌ ప్రయాణ ఆంక్షలు విధించిన కొద్దిరోజులకే ఎమిరేట్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఫ్రాన్స్‌ సైతం భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు 10 రోజుల క్వారంటైన్‌ విధిస్తామని ప్రకటించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని