ట్రంప్‌పై అభిశంసన తీర్మానం

తాజా వార్తలు

Published : 12/01/2021 02:09 IST

ట్రంప్‌పై అభిశంసన తీర్మానం

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అభిశంసన తీర్మానానికి ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్‌ సభ్యులు కూడా మద్దతు తెలుపుతుండడం గమనార్హం. అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు ముట్టడించడాన్ని ఆయన ప్రోత్సహించారని పేర్కొంటూ దిగువ సభలో డెమోక్రాటిక్‌ పార్టీ సభా నాయకుడు డేవిడ్‌ సిసిలీన్‌ అభిశంసన తీర్మానాన్ని రాశారు. దీనికి 185 మంది మద్దతు తెలిపారు. దీనిపై బుధవారం ఓటింగ్‌ నిర్వహించునున్నారు. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు. 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ ఈ నెల 6న క్యాపిటల్‌ భవనంలో సమావేశమైంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున్న ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులకు, అందోళనకారులకు జరిగిన ఘర్షణలో నలుగురు ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్‌ తన మద్దతుదారులను ప్రొత్సహించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించేందుకు డెమోక్రాట్లు తాజాగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఇవీ చదవండి..
ట్రంప్‌.. ఓ చెత్త అధ్యక్షుడు: ఆర్నాల్డ్‌
ట్రంప్‌ ‘ముప్పు’ను తొలగించుకుందాం!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని