Corona: చిన్నారుల్లో కనిపిస్తున్న వేరియంట్‌ కూడా అదే..!

తాజా వార్తలు

Published : 04/08/2021 01:40 IST

Corona: చిన్నారుల్లో కనిపిస్తున్న వేరియంట్‌ కూడా అదే..!

దిల్లీ: డెల్టా వేరియంట్ రూపంలో దేశంలో కరోనా వైరస్ ముప్పు కొనసాగుతూనే ఉంది. చిన్నారుల్లో కూడా ఈ వేరియంటే ప్రధానంగా కనిపిస్తోంది. రెండోవేవ్‌ వేళ కర్ణాటకలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘కరోనావైరస్ సోకిన పిల్లల్లో విలక్షణమైన వేరియంట్ ఏదీ లేదు. డెల్టానే ప్రధానంగా కనిపిస్తోంది’ అని ప్రొఫెసర్ రవి మీడియాకు వెల్లడించారు. కర్ణాటకలో చిన్నారుల నుంచి సేకరించిన నమూనాల్లోని వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్స్‌పై ఆయన అధ్యయనం చేస్తున్నారు.  

రెండోవేవ్‌లో పిల్లలకు సోకిన వైరస్‌ జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడం మూడోవేవ్‌కు సిద్ధమయ్యే ప్రయత్నాల్లో భాగమని నిపుణులు అంటున్నారు. వైరస్ కొత్త వేరియంట్లు పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయేమో అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ సహకరిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో అందిన సమాచారం ప్రకారం.. కర్ణాటకలో 77 శాతం ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంటే కారణమని తేలింది. మొత్తం 1,413 కేసులకు గానూ 1,089 కేసుల్లో డెల్టా వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడైంది. అలాగే 159 కప్పా, 155 ఆల్ఫా, ఏడు బీటా, మూడు డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 29.08లక్షల మందికి కరోనా సోకగా..దాదాపు పది శాతం(0-19 సంవత్సరాల వయస్సు) మంది 20 ఏళ్లలోపు వారున్నారు. అలాగే వారిలో మరణాల రేటు 0.1 శాతంగా ఉంది. 

ఇటీవల కాలంలో కేరళలో నిత్యం 20వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటంతో కర్ణాకటలో కలవరం మొదలైంది. ఆ రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. మూడోవేవ్ పొంచి ఉందన్న నివేదికల మధ్య ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని