దిల్లీలో మద్యం తాగే వయస్సు కుదింపు 

తాజా వార్తలు

Published : 22/03/2021 18:04 IST

దిల్లీలో మద్యం తాగే వయస్సు కుదింపు 

దిల్లీ: దేశ రాజధాని నగరంలో మద్యపానానికి చట్టబద్ధమైన వయస్సును దిల్లీ ప్రభుత్వం కుదించింది. గతంలో ఈ వయస్సు 25 ఏళ్లుగా ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు కుదిస్తున్నట్టు డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దిల్లీ కేబినెట్‌ కొత్త మద్యం పాలసీని ఆమోదించిందన్నారు. ఈ కొత్త విధానంలో ఆప్‌ సర్కార్‌ చేసిన పలు మార్పుల్లో భాగంగా వయస్సును కుదించారు. ఈ పాలసీ ప్రకారం.. దిల్లీ నగరంలో కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని.. అలాగే, మద్యం దుకాణాలు నిర్వహించరాదని నిర్ణయించినట్టు చెప్పారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన  నిపుణుల కమిటీ మద్యం తాగే వయస్సును 21కి మార్చాలని గతేడాది డిసెంబర్‌లో సిపారసు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం దిల్లీలో 60శాతం లిక్కర్‌ దుకాణాలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయని సిసోడియా తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని