Maharashtra: జనావాసాల్లో హల్‌చల్‌ చేస్తోన్న మొసళ్లు

తాజా వార్తలు

Published : 28/07/2021 19:15 IST

Maharashtra: జనావాసాల్లో హల్‌చల్‌ చేస్తోన్న మొసళ్లు

ముంబయి: మహారాష్ట్రలో సాంగ్లీ జిల్లాలో భారీ వరదల కారణంగా నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయి. వీధుల్లోను, ఇంటి పైకప్పుల మీద తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొసళ్లు ఇంటి పైకప్పులు, రహదారిపైకి వచ్చి సేదతీరడంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. కాగా సాంగ్లీ జిల్లాలోని కృష్ణా బేసిన్ పరిధిలో దాదాపు 50 మొసళ్లు ఉన్నట్లు తెలిపిన అధికారులు, నదిలో ఉన్న మొసళ్లు వరదల సమయంలో  గ్రామాల్లోకి వస్తుంటాయని పేర్కొన్నారు.  వరదలకు మైదాన ప్రాంతాలకు వచ్చే మొసళ్లతో గ్రామస్థులకు ఎలాంటి హానీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాటిని పట్టుకుని సంరక్షణకేంద్రాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని