ట్రంప్‌ తీరుతో రిపబ్లికన్‌ పార్టీలో చీలికలు!

తాజా వార్తలు

Updated : 13/01/2021 13:36 IST

ట్రంప్‌ తీరుతో రిపబ్లికన్‌ పార్టీలో చీలికలు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ఆయన సొంత పార్టీ రిపబ్లికన్‌లో చీలకలకు కారణమవుతోంది. ట్రంప్‌ తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కొంత మంది రిపబ్లికన్లు.. ఆయనను తొలగించేందుకు ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతున్న అభిశంసనకు మద్దతుగా ఓటేయనున్నట్లు ప్రకటించారు. 

తొలుత రిపబ్లికన్ పార్టీలో మూడో అత్యంత శక్తిమంతమైన నేతగా పెరుగాంచిన లిజ్‌ చెనీ ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష హోదాను ట్రంప్‌ దుర్వినియోగపరిచినంతగా మరెవరూ చేయలేదని ఆమె విమర్శించారు. క్యాపిటల్‌ భవనంపై దాడి ట్రంప్‌ పిలుపు మేరకే జరిగిందని ఆరోపించారు. దాడి జరిగే సమయంలో ట్రంప్‌ జోక్యం చేసుకొని నిలువరించాల్సిందని అభిప్రాయపడ్డారు. మరో నేత ఆడమ్‌ కిన్‌జింగర్‌, జాన్‌ కట్కో కూడా చెనీ బాటలోనే పయనించనున్నట్లు ప్రకటించారు. మరికొంత మంది కూడా ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.

అదే పార్టీలోని మరో వర్గం ట్రంప్‌ అభిశంసనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరి రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభించడం కేవలం రాజకీయ కుట్రేనని ఆరోపించింది. దీనివల్ల అధికార బదిలీకి ఆటంకం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అయితే, డెమొక్రాట్లు మాత్రం ట్రంప్‌ తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నేడు ప్రతినిధుల సభలో అభిశంసనపై ఓటింగ్‌ జరగనుంది. 

ఇవీ చదవండి..

వాషింగ్టన్‌లో ఆత్యయిక పరిస్థితి

అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని