Mamata Banerjee: తగినన్ని టీకాలు ఇవ్వకపోతే.. కొవిడ్ ప్రమాదకరంగా మారుతుంది

తాజా వార్తలు

Published : 05/08/2021 18:05 IST

Mamata Banerjee: తగినన్ని టీకాలు ఇవ్వకపోతే.. కొవిడ్ ప్రమాదకరంగా మారుతుంది

టీకా సరఫరాపై ప్రధానికి లేఖ రాసిన మమతా బెనర్జీ

కోల్‌కతా: తమ రాష్ట్రానికి టీకాల సరఫరాను పెంచకపోతే.. కొవిడ్ పరిస్థితి భయంకరంగా మారే అవకాశం ఉందని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో అధిక జనాభాకు తగ్గట్టుగా టీకా డోసులు అందడం లేదని ఆరోపించారు. అర్హులందరికీ టీకా అందించేందుకు 14 కోట్ల డోసులు అవసరమవుతాయని తెలిపారు.

‘ప్రస్తుతం మేం రోజుకు నాలుగు లక్షల టీకాలు వేస్తున్నాం. రోజుకు 11 లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. అధిక జనసాంద్రత ఉన్నప్పటికీ.. తక్కువ సంఖ్యలో టీకాలు అందుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ప్రధానికి పలుమార్లు లేఖ రాసినప్పటికీ.. తగిన స్పందన లభించలేదు. ఇతర రాష్ట్రాలకు భారీగా టీకాలు సరఫరా చేస్తున్నారని అంటున్నందుకు నన్ను క్షమించండి. వారికి పెద్ద మొత్తంలో టీకాలు ఇచ్చినా నాకెలాంటి సమస్య లేదు. కానీ బెంగాల్‌కు అన్యాయం జరుగుతుంటే మాత్రం నేను నిశ్శబ్దంగా ఉండలేను’ అంటూ ఆ లేఖలో మమత పేర్కొన్నారు. అలాగే కొవిడ్ నియంత్రణకు రాష్ట విధానాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. అందుకే పాజిటివిటీ రేటు 1.57 శాతంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు అక్కడ మూడు కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని