భర్తను కాపాడాలంటూ సీఎం ఇంటివద్దకు..

తాజా వార్తలు

Published : 07/05/2021 21:47 IST

భర్తను కాపాడాలంటూ సీఎం ఇంటివద్దకు..

బెంగళూరు: కరోనా సోకిన తన భర్తను కాపాడుకునేందుకు కర్ణాటక రాష్ట్రం రామోహళి సమీపంలోని చిక్కళూరుకు చెందిన ఓ మహిళ విఫలయత్నం చేసింది. పడక ఏర్పాటు చేయాలని బెంగళూరులోని ముఖ్యమంత్రి నివాసం వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది. స్పందించిన అధికారులు స్థానిక ఎమ్మెస్‌ రామయ్య ఆసుపత్రిలో పడక ఏర్పాటుచేసి ఆమెను అక్కడికి పంపించారు. అయితే పరిస్థితి విషమించి అప్పటికే ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు.

కర్ణాటకలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్దిరోజులుగా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది. రాజధాని బెంగళూరులో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నారు. పాజిటివిటీ రేటు 50 శాతానికిపైగానే నమోదవుతోంది. అక్కడ ఇద్దరికి పరీక్షలు నిర్వహిస్తే అందులో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధరణ అవుతోంది.

కర్ణాటకలో ఏప్రిల్‌ 27 నుంచి మే 12 వరకు పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. అయినా కేసుల్లో తగ్గుదల కనిపించకపోవడంతో 12 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో గురువారం ఒక్కరోజే 50,112 కేసులు నమోదవగా 346 మంది ప్రాణాలు కోల్పోయారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని