West Bengal: ఇకపై 11వ తరగతిలో పాఠ్యాంశంగా ‘కరోనా వైరస్‌’

తాజా వార్తలు

Published : 11/09/2021 21:09 IST

West Bengal: ఇకపై 11వ తరగతిలో పాఠ్యాంశంగా ‘కరోనా వైరస్‌’

నిర్ణయించిన పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం
6వ తరగతి నుంచే అమలు చేయాలని మరో ప్రతిపాదన

కోల్‌కతా: మహమ్మారి కరోనా యావత్‌ ప్రపంచాన్ని ఎంత అల్లకల్లోం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే విషయాన్ని విద్యార్థులకు ఓ పాఠ్యాంశంలా బోధించాలని నిర్ణయించింది పశ్చిమ బెంగాల్‌ సర్కార్‌. ఇకపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లోని 11వ తరగతిలో ‘హెల్త్‌ అండ్‌ ఫిజకల్‌ ఎడ్యుకేషన్‌’ సబ్జెక్ట్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన పూర్తి అంశాలను బోధించనున్నారు. ఇందులో కరోనా అంటే ఏమిటి? అది ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది? వైరస్‌ లక్షణాలేమిటి? క్వారంటైన్‌కి సంబంధించిన తదితర వివరాలు పూర్తిగా ఉంటాయి. అంతే కాదు.. కేవలం 11వ తరగతికి మాత్రమే కాకుండా 6-10వ తరగతి పాఠ్యాంశాల్లో బోధించాలని యోచిస్తోంది బెంగాల్‌ ప్రభుత్వం. ఈమేరకు అలాంటి ఆలోచనలతో ముందుకు రావాలని సలహా కమిటీ ప్రభుత్వానికి సూచించింది. విద్యాశాఖకు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ వల్ల మన ఆత్మీయులను కోల్పోవాల్సి వచ్చింది. అందుకే విద్యార్థులకు దీని మీద కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అన్నారు. ఇదే విషయంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటు వ్యాధుల నిపుణులు డా. యోగిరాజ్ రాయ్ మాట్లాడుతూ..‘‘ కరోనా వైరస్‌ గురించి పాఠ్యాంశాల్లో చేర్చడమనేది ఓ మంచి నిర్ణయం. పిల్లలకు కనుక దీని మీద అవగాహన వస్తే.. ముందస్తు నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుంది’’ అన్నారు. ప్రజా ఆరోగ్య నిపుణులు కాజల్‌ కృష్ణ బానిక్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాల్యం నుంచే పిల్లలకు అవగాహన తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. తద్వారా సమాజంలో కరోనా అంటే భయంపోతుందన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని