Maglev Train: భూమిపై అత్యంత వేగవంతమైన రైలు ఆవిష్కరణ

తాజా వార్తలు

Published : 20/07/2021 23:19 IST

Maglev Train: భూమిపై అత్యంత వేగవంతమైన రైలు ఆవిష్కరణ

బీజింగ్‌: చైనా మాగ్నెటిక్‌ లెవిటేషన్‌ ఆధారంగా ప్రయాణించే సరికొత్త రైలును ఆవిష్కరించింది. ఇది గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని దీని తయారీదారులు చెబుతున్నారు. ఈ రైలును చైనా పూర్తిగా దేశీయ సాంకేతికతతో షాంన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని క్వాంగ్‌డావ్‌ పట్టణంలో ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా భూమిపై అత్యధిక వేగంతో ప్రయాణించే వాహనం ఇదే అని చెబుతున్నారు. ఇది విద్యుదయస్కాంత శక్తి ఆధారంగా నడుస్తుందని చైనా రైల్వే రోలింగ్‌ స్టాక్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. ఈ రైలు ప్రయాణించే సమయంలో పట్టాలను తాకదు. 

ఈ రైలుకు వాడిన సాంకేతికతను చైనా దాదాపు రెండు దశాబ్దాలుగా పరిమితంగా వినియోగిస్తోంది. ఇప్పటికే షాంఘైలోని విమానాశ్రయం నుంచి నగరంలోకి ప్రయాణించేందుకు ఇటువంటి టెక్నాలజీతో చేసిన రైలును వాడుతోంది. చైనాలోని ప్రావిన్స్‌ల మధ్య మాత్రం ఇటువంటి రైలు సేవలు లేవు. వీటి నిర్మాణం దిశగా ఇప్పటికే షాంఘై, చెంగ్డూలో పరిశోధనలు మొదలయ్యాయి. ఈ రైలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే షాంఘై-బీజింగ్‌ మధ్య 1,000 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 2.5 గంటల్లో పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం విమానంలో మూడు గంటలు పడుతుండగా.. అందుబాటులో ఉన్న హైస్పీడ్‌ రైళ్లల్లో ఐదు గంటల సమయం పడుతోంది. పెద్ద నగరాల మధ్య మూడుగంటల ట్రాన్స్‌పోర్టు సర్కిల్స్‌ ఏర్పాటు కోసం చైనా వీటిని సిద్ధం చేసింది. 

జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఇటువంటి మాగ్‌లేవ్‌ రైలు నెట్‌వర్క్‌ల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పట్టాలను తొలగించి కొత్తవి నిర్మించడం ఖర్చుతో కూడుకొన్న పని. ప్రాజెక్టు వ్యయాలను చూసి చాలా దేశాలు వెనుకంజ వేస్తున్నాయి.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని