ప్రకృతిలో మార్పులా సమాజం మారుతోంది: ఒబామా

తాజా వార్తలు

Updated : 11/09/2020 14:15 IST

ప్రకృతిలో మార్పులా సమాజం మారుతోంది: ఒబామా

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు శాన్‌ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కార్చిచ్చు కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. అగ్నికీలలు నుంచి వెలువడిన దట్టమైన పొగ కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నీలిరంగులో ఉండాల్సిన ఆకాశం నారింజ రంగులోకి మారింది. మధ్యాహ్నం కావస్తున్నా ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నట్లుగా చీకటిగానే కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అమెరికన్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

'వెస్ట్ కోస్ట్ ప్రాంతమంతటా మంటలంటుకొని వాతావరణం పూర్తిగా నారింజ రంగులోకి మారిపోయింది. ప్రకృతి ప్రకోపంతో ఇలా మారిపోయినట్లే మన సమాజం కూడా అంతే వేగంగా మారుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. మన భవిష్యత్తును కాపాడుకోవడంలో ఓటుకు అంతే ప్రాధాన్యం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒబామా చేసిన ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని