Delhi: వారికోసం వీలైనన్ని టీకాలు తెప్పించండి

తాజా వార్తలు

Published : 09/06/2021 20:49 IST

Delhi: వారికోసం వీలైనన్ని టీకాలు తెప్పించండి

దిల్లీ: కరోనా మలిదశలు పొంచి ఉన్నాయనే వార్తల నేపథ్యంలో చిన్నారులను సురక్షితంగా ఉంచేందుకు కేంద్రం వీలైనన్ని ఎక్కువ టీకాలను సేకరించాలని దిల్లీ ప్రభుత్వం కోరింది. కరోనా మూడో ముప్పు.. పిల్లలపై ప్రభావం చూపనుందనే ఆందోళనల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా బుధవారం ట్విటర్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశారు.

‘ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు 12 ఏళ్లలోపు చిన్నారులకు టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మన పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు వీలైనన్ని ఎక్కువ టీకాలను సేకరించాలి. అందుకు తగిన చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు. దానికి సంబంధించి ఆంగ్ల మీడియాలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు అందుతున్నాయి. అయితే కరోనా మూడో ముప్పు చిన్నారులపై ప్రతాపం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని దిల్లీ ప్రభుత్వం చిన్నారుల గురించి ఆందోళన చెందుతోంది. వారికి త్వరగా టీకాలు అందుబాటులోకి తేవాలంటూ కొద్దిరోజులుగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తోంది. మరోపక్క రెండు నుంచి 18ఏళ్ల మధ్య వయసు కలిగిన వారిపై దిల్లీలోని ఎయిమ్స్ కొవాగ్జిన్ టీకాను పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్నాలోని ఎయిమ్స్‌లో కూడా క్లినికల్ పరీక్షలు మొదలయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని