హత్యను దాచబోయి.. కార్చిచ్చుకు కారణమై..

తాజా వార్తలు

Updated : 30/04/2021 13:36 IST

హత్యను దాచబోయి.. కార్చిచ్చుకు కారణమై..

కాలిఫోర్నియా: గతేడాది ఆగస్టులో అమెరికాలో కాలిఫోర్నియా భారీ కార్చిచ్చు సంభవించిన విషయం తెలిసిందే. ఆ అగ్నికీలల్లో వందలాది భవంతులు కాలి బూడిదయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ఆ ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేసే క్రమంలో వెలుగుచూసిన నిజాలతో పోలీసులు షాకయ్యారు. ఓ మనిషిని చంపేసి, ఆ హత్యను దాచిపెట్టే ప్రయత్నం.. కార్చిచ్చుకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

ఉత్తర కాలిఫోర్నియాలోని సొలానో కౌంటీలో గల అడవుల్లో గతేడాది ఆగస్టులో మంటలు చెలరేగాయి. అది కాస్తా అడవి మొత్తం వ్యాపించింది. అయితే సొలానో కౌంటీలో మంటలు చెలరేగిన ప్రాంతానికి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు ఆ తర్వాత గుర్తించారు. దర్యాప్తులో ఆ మృతదేహం 32ఏళ్ల ప్రిసిల్లా కాస్ట్రోగా తేలింది. అగ్నిప్రమాదానికి రెండు రోజుల ముందు విక్టర్‌ సెరింటినో అనే వ్యక్తితో డేట్‌కు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. ‘‘8 నెలల సుదీర్ఘ దర్యాప్తు ఆధారంగా సెరింటినో తన నేరాన్ని దాచిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే అడవికి నిప్పుపెట్టాడని మేం విశ్వసిస్తున్నాం’’ అని పోలీసులు తాజాగా ఇచ్చిన ప్రకటనలో వెల్లడించారు. 

సొలానో కౌంటీలో మొుదలైన మంటలు క్రమక్రమంగా విస్తరించాయి. అదే సమయంలో అడవిలోని కొన్నిచోట్ల పిడుగులు పడటంతో మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భారీ కార్చిచ్చు సంభవించింది. కాలిఫోర్నియా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుల్లో ఒకటిగా మిగిలింది. మంటల ఉద్ధృతికి వేల సంఖ్యలో భవనాలు కాలిపోయాయి. దాదాపు 3.63లక్షల ఎకరాల్లో చెట్లు బూడిదయ్యాయి. సుమారు ఐదు లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని