కరోనా రోగులకు తోడుగా.. ‘దేవుడి చేయి’

తాజా వార్తలు

Published : 09/04/2021 19:51 IST

కరోనా రోగులకు తోడుగా.. ‘దేవుడి చేయి’

బ్రెసీలియా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ సోకినవారు ఒంటరిగా జీవిస్తూ మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. దాంతో కుంగుబాటుకు గురవుతున్నారు. దీనిని అధిగమించేందుకు బ్రెజిల్‌కు చెందిన నర్సులు వినూత్న ప్రయత్నం చేశారు. అందుకు వారేం పెద్దగా కష్టపడలేదు. వారి చిన్న ఆలోచన ప్రస్తుతం ప్రశంసలందుకుంటోంది. రెండు రబ్బర్‌ గ్లౌజుల్లో వేడి నీరు పోసి వాటిని కరోనా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల చేతికి ఇరువైపులా కడుతున్నారు. ఈ విధంగా చేస్తే తమకు అండగా ఓ వ్యక్తి ఉన్నాడనే భావన వారికి కలుగుతుందని నర్సులు చెబుతున్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి చేతికి కట్టిన గ్లౌజుల ఫొటోను ఓ జర్నలిస్ట్‌ ట్విటర్‌లో పంచుకొని దానిని ‘దేవుడి చేయి’గా అభివర్ణించారు. కరోనా రోగుల బాధను తీర్చేందుకు నర్సులు చేస్తున్న కృషికి సెల్యూట్‌ అని పేర్కొన్నారు. ఆయన పంచుకున్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వేల మంది లైకులు, రీట్వీట్లు చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రోగులకు అండగా ఉన్నామని తెలిపే వారి ప్రయత్నానికి అభినందనలు కురిపిస్తున్నారు. తమ పరిధిలోని ఆస్పత్రుల్లోనూ ఈ తరహా ప్రయత్నం చేయాలని అధికారులు, ఆసుపత్రి యాజమాన్యాలను కోరతామని మరికొందరు పేర్కొంటున్నారు.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని