ఆ దేశంలో 75 రోజుల్లో లక్ష కరోనా మరణాలు!

తాజా వార్తలు

Published : 25/03/2021 11:21 IST

ఆ దేశంలో 75 రోజుల్లో లక్ష కరోనా మరణాలు!

బ్రెజిలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. గడిచిన వారం రోజుల్లో ఆ దేశంలో రోజుకు సగటున 2,273 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య మూడు లక్షలు దాటింది. బుధవారం రెండు వేలకు పైగా మరణాలు సంభవించడంతో.. వైరస్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రెజిల్‌లో నమోదైన మరణాల మొత్తం 3,00,685కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,251 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం గత 75 రోజుల్లోనే లక్ష మంది కరోనా ధాటికి మృత్యువాత పడినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

రాజకీయంగా సమన్వయలేమి వల్లే దేశంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోగ్య నిపుణులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మరోవైపు, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో ఇటీవల సంక్షోభ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఐదు లక్షలకు పైగా కరోనా మరణాలతో అమెరికా తొలిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండో స్థానంలో బ్రెజిల్‌ ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని