24 గంటల్లో సున్నా నుంచి 57 లక్షలకు!

తాజా వార్తలు

Updated : 22/01/2021 23:37 IST

24 గంటల్లో సున్నా నుంచి 57 లక్షలకు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌కు ఫాలోయింగ్‌ మామూలుగా లేదు. ట్విటర్‌లో సున్నా ఫాలోవర్లతో మొదలైన ఆయన అధికారిక ఖాతా.. 24 గంటలు గడవకుండానే ఐదు మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం నాటికి సున్నా ఫాలోవర్లు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 57 లక్షలకు చేరుకోవటం విశేషం. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUS ను ట్విటర్‌ యాజమాన్యం బైడెన్‌కు బదలాయించిన సంగతి తెలిసిందే. ఐతే, గతంలో ఎన్నడూ లేని విధంగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పటి లక్షలాది ఫాలోవర్లను తొలగించింది. బైడెన్‌కు పోటస్‌ ఖాతాను అప్పగించే సమయానికి ఫాలోవర్ల సంఖ్యను సున్నా చేసింది. దీనిపై బైడెన్‌ బృందం కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పోటస్‌ను అనుసరించిన వాళ్లు కావాలనుకుంటే మళ్లీ అదే ఖాతాను ఫాలో అవ్వొచ్చని ట్విటర్‌ స్పష్టం చేసింది. 

అయితే సున్నా ఫాలోవర్లతో మొదలైనప్పటికీ.. బైడెన్‌కు ట్విటర్‌లో తొలిరోజే విశేషాదరణ లభించింది. ప్రస్తుతం ఆయనను పోటస్‌ ఖాతా నుంచి అనుసరించేవారి సంఖ్య 57లక్షలకు పైనే ఉంది. అయితే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అధికారిక ఖాతా @VPని ఏకంగా 74లక్షల మందికి పైనే అనుసరిస్తుండటం విశేషం. 

ఇదీ చదవండి..

కరోనాపై యుద్ధం.. ఇదే బైడెన్‌ అస్త్రంAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని