Covaxin: అమెరికాలో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌
close

తాజా వార్తలు

Published : 12/06/2021 17:22 IST

Covaxin: అమెరికాలో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

హైదరాబాద్‌: భారత ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అమెరికాలో కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ మేరకు కంపెనీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూఎస్‌లో మార్కెట్‌ అప్లికేషన్‌ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఏయే ప్రాంతాల్లో ట్రయల్స్‌ చేపట్టనున్నారు? అందులో ఎంతమంది వాలంటీర్లు పాల్గొనున్నారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 

కరోనా వ్యాప్తి నివారణ కోసం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ది చేసింది. ఈ టీకాను విదేశాల్లోనూ మార్కెటింగ్‌ చేయాలని భావిస్తున్న సంస్థ.. ఇందుకోసం ఆక్యుజన్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగం కోసం ఆక్యుజన్‌ దరఖాస్తు సిద్ధం చేయగా.. అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ యూఎప్‌ఎఫ్‌డీఐ అందుకు అనుమతించలేదు. అత్యవసర వినియోగానికి బదులు బయోలాజిక్స్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌(బీఎల్‌ఏ) సమర్పించాలని సూచించింది. అయితే బీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకోవాలంటే టీకా గురించి మరింత సమాచారాన్ని అందించాలి. ఈ నేపథ్యంలోనే భారత్‌ బయోటెక్‌ అక్కడ కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది.

మరోవైపు అమెరికాతో పాటు కెనడాలోనూ కొవాగ్జిన్‌ విక్రయాలు చేపట్టేందుకు భారత్‌ బయోటెక్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే కెనడాలో హక్కుల కోసం ఆక్యుజన్‌ సంస్థ ఇటీవల భారత్‌ బయోటెక్‌కు 15 మిలియన్‌ డాలర్లు ముందస్తుగా చెల్లించింది. త్వరలోనే ఆ దేశంలోనూ కొవాగ్జిన్‌ అనుమతి కోసం ఆక్యుజన్‌ దరఖాస్తు చేయనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని