త్వరలో డబ్ల్యూహెచ్‌వో లిస్టింగ్‌లోకి కొవాగ్జిన్‌!

తాజా వార్తలు

Published : 24/05/2021 21:14 IST

త్వరలో డబ్ల్యూహెచ్‌వో లిస్టింగ్‌లోకి కొవాగ్జిన్‌!

90 శాతం పత్రాలు సమర్పించామన్న భారత్‌ బయోటెక్‌

దిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ జాబితాలో త్వరలోనే కొవాగ్జిన్‌ చోటు దక్కించుకుంటుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ విశ్వాసం వ్యక్తంచేసింది. గుర్తింపునకు సంబంధించి 90 శాతం పత్రాలు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వోకు సమర్పించామని ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. మిగిలిన పత్రాలు జూన్‌ నాటికి సమర్పిస్తామని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు విషయమై కేంద్రంతో చర్చ సందర్భంగా ఈ వివరాలను వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఏ దేశం కూడా వ్యాక్సిన్‌ పాస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయలేదని, ప్రతి దేశమూ వారి వారి అవసరాల కోసం కొవిడ్‌ నెగెటివ్‌కు సంబంధించిన ఆర్టీ-పీసీఆర్‌ రిపోర్ట్‌తో ప్రయాణానికి అనుమతిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొవాగ్జిన్‌ 11 దేశాల్లో రెగ్యులేటరీల నుంచి అనుమతి పొందిందని, 7 దేశాల్లో 11 కంపెనీలు సైతం కొవాగ్జిన్‌ సాంకేతికత బదిలీ, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాలో పరిమిత సంఖ్యలో ఫేజ్‌-3 ట్రయల్స్‌ నిర్వహించేందుకు అక్కడి ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)తో జరుపుతున్న చర్చలు చివరి దశలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని