బెంగాల్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం

తాజా వార్తలు

Updated : 29/04/2021 11:48 IST

బెంగాల్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం చివరి (8వ) దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 35 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ సమయం ప్రారంభం కాగానే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. 35 స్థానాల పరిధిలో 84.77 లక్షల ఓటర్లు ఉండగా.. 11,860 కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఓటర్లు వైరస్‌ బారిన పడకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో 753 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ దశలో మొత్తం 283 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 

రాష్ట్రంలో ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండగా.. మరోవైపు పోలింగ్‌ జరుగుతోంది. బెంగాల్‌లో బుధవారం ఒక్కరోజే 17వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా, 77 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బెంగాల్‌తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని