ఇకపై అక్కడ ఎవరైనా భూమి కొనొచ్చు!

తాజా వార్తలు

Published : 28/10/2020 00:56 IST

ఇకపై అక్కడ ఎవరైనా భూమి కొనొచ్చు!

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన కేంద్రం

దిల్లీ: జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో ఇకపై ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన భూ చట్టాల నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం భారతీయ పౌరులెవరైనా జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో భూవిక్రయాలు జరపవచ్చు. జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసిగా ఉన్నవారే అక్కడ భూమి కొనుక్కోవచ్చని గతంలో ఉన్న డొమిసైల్‌ ఆప్షన్‌ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా తొలగించింది.  

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి అక్కడి చట్టాల్లో కీలక మార్పులు చేస్తోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని