
తాజా వార్తలు
కేటీఆర్ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్ చూశారా..?
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు..
మట్టిలో పుట్టిన మాణిక్యం..
130 కోట్ల మందిలో ఎంత మంది ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్లు పుట్టాలి..
వంటి డైలాగ్‌లు తరచూ వింటుంటాం కదా..! కేటీఆర్ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్ చూస్తే ఆ మాటలన్నింటికీ సార్థకం చేకూరినట్లే అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే...
తోటి పిల్లలో సరదాగా ఊరి చివరకు వెళ్లి ఆడుకునే వయస్సు. టాలెంట్ మాత్రం ఘనం. అలాంటి ఓ పిల్లోడు.. నగర శివారున ఉన్న మట్టి దిబ్బల్లో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో చేసిన స్టంట్లు ఒలింపిక్ పోటీల్లో ప్రొఫెషనల్ జిమ్నాస్ట్‌లు చేసే సాహసాలను తలపిస్తున్నాయి. పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోనే పల్టీలు కొడుతున్న తీరు.. శరీరాన్ని అలవోకగా మెలిపెట్టడం చూస్తుంటే.. భవిష్యత్తులో మనకు ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఖాయం అనిపించక మానదు. అయితే, ఆ కుర్రాడు ఎవరు.. ఏ ప్రాంతానికి చెందినవాడన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించింది. ఇంకేముంది.. ఆ వజ్రానికి సానపెట్టేందుకు సిద్ధమయ్యారాయన.
ఆదివారం అద్భుతమైన ఉత్సాహం కలిగించిన వీడియో అంటూ పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి తొలుత ట్వీట్ చేశారు. ఈ మట్టిలో పుట్టిన మాణిక్యాన్ని చూసి ఫిట్‌గా ఉండాలన్న ప్రోత్సాహం కలిగిందంటూ.. తన సందేశానికి మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేశారు. దీన్ని వీక్షించిన ఆయన ‘వావ్..’ అంటూ ఆశ్చర్యపోయారు. భావి ఒలింపిక్ పతక విజేత తయారవుతున్నాడంటూ కుర్రాడి ప్రతిభను కొనియాడారు. ఆ అబ్బాయి తెలంగాణకు చెందినవాడా? లేక భారత్‌లోని ఇతర ప్రాంతానికి చెందినవాడా?అని ఆరా తీశారు. అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన ఆ కుర్రాడికి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చారు. ఓ బాధ్యతగల ప్రజాప్రతినిధిగా జనాల్లోని ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ కుర్రాడి టాలెంట్ ఎంతటిదో కింద ట్విటర్లో మీరూ చూసేయండి.
ఇవీ చదవండి...
మేం గెలవడానికి కారణం టిమ్‌పైనే..
దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోండి: కేటీఆర్