close

తాజా వార్తలు

‘ఉపహార్‌’తర్వాత దిల్లీలో రెండో పెద్ద ప్రమాదం

దిల్లీ: దేశరాజధాని దిల్లీలోని అనాజ్‌మండీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు 43 మంది వరకు దుర్మరణం చెందారు. దిల్లీ చరిత్రలో ఉపహార్‌ సినిమా అగ్ని ప్రమాదం తర్వాత ఇదే అతి పెద్దది. ఈ ఘటనలో దాదాపు వంద మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేజ్రీవాల్‌ రూ.10లక్షలు పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు కేంద్రం నుంచి  పీఎం సహాయనిధి కింద రూ.2లక్షలు పరిహారాన్ని అందించనున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

పహార్‌ సినిమా ఘటన: 

ఉపహార్‌ సినిమా భవనం అగ్నిప్రమాదం భారత దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటి. ఉపహార్‌ సినిమా థియేటర్లోని ట్రాన్స్‌ఫార్మర్‌లు షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో 1997, జూన్‌ 13న జరిగిన ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో 59 మంది మృతి చెందగా, వంద మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటన అనంతరం పలు బాధిత కుటుంబాలు ఉపహార్‌ అగ్ని ప్రమాద బాధితుల సంఘం(ఏవీయూటీ)గా ఏర్పడి నష్ట పరిహారం కోసం పౌర పరిహార కేసు నమోదు చేశాయి. దిల్లీ హైకోర్టులో వారు ఈ కేసులో గెలిచి రూ.25కోట్ల పరిహారాన్ని సాధించగలిగారు. అనంతరం ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ థియేటర్‌ యజమానులైన సుశీల్‌ అన్సల్‌, గోపాల్‌ అన్సల్‌తో పాటు 16 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం అన్సల్‌ సోదరులు ఇద్దరినీ కోర్టు దోషులుగా తేల్చింది. ఆ తర్వాత వారికి ఒక్కొక్కరికి రూ.30కోట్లు జరిమానా విధించింది. 2017లో సుప్రీంకోర్టు గోపాల్‌ ఏడాది పాటు జైలు శిక్షకు ఆదేశించింది. అతడి సోదరుడైన సుశీల్‌ను వయసు(వృద్ధాప్యం) కారణాలతో వదిలిపెట్టింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.