Viral Video: నన్నే వీడియో తీస్తావా? డ్రోన్‌పై మొసలి దాడి!

తాజా వార్తలు

Published : 02/10/2021 01:43 IST

Viral Video: నన్నే వీడియో తీస్తావా? డ్రోన్‌పై మొసలి దాడి!

మెల్‌బోర్న్‌‌‌: ఆస్ట్రేలియాలో మొసళ్లను చిత్రీకరిస్తున్న డ్రోన్‌పై అనూహ్యంగా ఘటన చోటుచేసుకుంది. వీడియో తీస్తుండగా ఓ మొసలి డ్రోన్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో డ్రోన్‌ పూర్తిగా ధ్వంసం కాగా.. ఆ దాడి దృశ్యాలు మాత్రం రికార్డు అయ్యాయి. ఉత్తర ఆస్ట్రేలియాలో మొసళ్ల వేట విపరీతంగా పెరగడంతో దీనిపై ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఏబీసీ) డాక్యుమెంటరీ రూపొందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డార్విన్‌ సిటీలోని మొసళ్ల పార్కులో వాటి దృశ్యాలను డ్రోన్‌ సాయంతో చిత్రీకరిస్తుండగా.. ఓ మొసలి మెరుపు వేగంతో డ్రోన్‌ పైకి దూసుకొచ్చింది. *నన్నే వీడియో తీస్తావా.. ఎంత ధైర్యం.. ఆగు నీ పనిచెప్తా@ అన్నట్టుగా నీటిలోంచి ఒక్కసారిగా పైకి లేచి అమాంతం డ్రోన్‌పై విరుచుకుపడింది. నీటిపై తేలియాడుతూ వచ్చిన ఆ మొసలి ఒక్కసారిగా పైకిలేచి తన నోటితో ఆ డ్రోన్‌ను పట్టుకొని తనవైపు లాగేయడంతో అది నీటిలోనే కుప్పకూలిపోయింది. అయితే, రెండు వారాల తర్వాత ఆ డ్రోన్‌ని సరస్సు ఒడ్డున గుర్తించినట్టు పార్కు అధికారి ఒకరు తెలిపారు. ఆ డ్రోన్‌లో నిక్షిప్తమైన ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని