కరోనాతో.. తగ్గిన కర్బన ఉద్గారాలు

తాజా వార్తలు

Published : 11/12/2020 23:54 IST

కరోనాతో.. తగ్గిన కర్బన ఉద్గారాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, పర్యావరణ పరంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది 7% మేర బొగ్గుపులుసు వాయువు‌ ఉద్గారాల విడుదల తగ్గినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావటంతో పాటు కార్లు, విమానాల వినియోగం పూర్తిగా తగ్గిపోవటం ఇందుకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు ఎర్త్‌ సిస్టం సైన్స్‌ డేటా మ్యాగజైన్‌లో ఓ కథనం ప్రచురితమైంది. గతంతో పోల్చినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ రికార్డు స్థాయిలో పడిపోయిందని, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో వెల్లడైంది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా 36.4 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలు గాలిలోకి విడుదల కాగా... ఈ ఏడాది 34 బిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు తగ్గింది. అమెరికాలో ఉద్గారాల విడుదల 12 శాతం మేరకు, ఐరోపా దేశాల్లో ఇది 11 శాతం మేర క్షీణించిందని నిపుణుల బృందం తెలిపింది. అయితే చైనాలో మాత్రం 1.7 శాతమే తగ్గినట్లు పేర్కొంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని