Afghanistan Crisis: మహిళలు బయటకు రావొద్దు.. తాలిబన్ల హుకుం

తాజా వార్తలు

Published : 24/08/2021 21:15 IST

Afghanistan Crisis: మహిళలు బయటకు రావొద్దు.. తాలిబన్ల హుకుం

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల ఆక్రమణలోకి వచ్చాక అక్కడ పరిస్థితులు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. వారి హయాంలో మహిళలపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. ఇళ్లలోనే ఉండాలని, భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని తాలిబన్లు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు, అఫ్గానిస్థాన్‌ నుంచి తరలింపు ప్రక్రియను అమెరికా ఈ నెల 31 కల్లా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ డెడ్‌లైన్‌ను పొడిగించేందుకు తమ గ్రూపు అంగీకరించదని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ స్పష్టంచేశారు. అఫ్గానిస్థాన్‌లో జనజీవనానికి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని.. అయితే, విమానాశ్రయం వద్ద ఆందోళనకర పరిస్థితులు అందుకు ఆటంకంగా మారాయన్నారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో అనేకమంది ప్రజలు భయంతో దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 

సీఐఏ డైరెక్టర్‌ భేటీపై సమాచారం లేదు!

మరోవైపు, తాలిబన్‌ నేతలతో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డైరెక్టర్‌ భేటీపై సమాచారం తనకు తెలియదని ముజాహిద్‌ తెలిపారు. అలాగని.. ఆ సమావేశం జరగలేదని కూడా తాను చెప్పలేనన్నారు. అఫ్గాన్‌ నిపుణుల తరలింపును అమెరికా నిలిపివేయాలని.. వారి వలసలను ప్రోత్సహించొద్దని అగ్రరాజ్యాన్ని తాలిబన్లు కోరారు. పంజ్‌షిర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని