close

తాజా వార్తలు

వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..

ఎర్నాకుళం: పామును చూస్తేనే మనం భయంతో పరుగులు తీస్తాం.. కాస్త తెగువ ఉన్నవారయితే చంపటానికి ప్రయత్నిస్తారు. కానీ కేరళలోని ఎర్నాకుళంలో ఓ మహిళ ఏకంగా 20 కిలోల బరువున్న కొండచిలువను ప్రాణాలతో పట్టుకుని దాన్ని ఓ సంచిలో బంధించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

బిహార్‌కు చెందిన విద్య రాజు అనే మహిళ ఎర్నాకుళంలోని పానంపల్లి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఓ రోజు ఆమె తన ఇంటి వెనకవైపు ఖాళీ స్థలంలో చెట్టు కింద 20 కిలోల బరువున్న కొండచిలువ దాక్కున్న విషయాన్ని గమనించారు. స్వతహాగా పాములు పట్టుకోవడంలో అనుభవం ఉన్న ఆమె ఆ సమయంలో ఏ మాత్రం అధైర్యపడకుండా కొండచిలువ మెడ భాగంలో గట్టిగా నొక్కి పట్టుకుని, మరో ఇద్దరు వ్యక్తులు సాయంతో దాని తోక భాగాన్ని పట్టుకొని సంచిలో బంధించారు. ఈ తతంగం మొత్తాన్ని హరిందర్‌ సిక్కా అనే వ్యక్తి వీడియో తీసి ట్విటర్‌లో షేర్‌ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.