close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/07/2020 23:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బలగాల ఉపసంహరణకు కట్టబడి ఉన్నాం

డబ్ల్యూఎంసీసీ సమావేశంలో వెల్లడించిన భారత్-చైనా

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి సైన్యం ఉపసంహరణకు తాము కట్టుబడి ఉన్నామని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత్-చైనా సరిహద్దు అంశంపై సంప్రదింపులు, సమన్వయ కార్యచరణ యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) 16వ సమావేశంలో ఇరు దేశాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అలానే ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి ఎంతో అవసరమని ఇరు పక్షాలు అభిప్రాయపడ్డాయి.

ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశాంగ శాఖ తూర్పు ఆసియా సంయుక్త కార్యదర్శి ప్రాతినిధ్యం వహించగా, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖలోని సరిహద్దు, సముద్ర విభాగం డైరెక్టర్‌ జనరల్‌ పాల్గొన్నారు. అలానే ఎల్ఏసీ వెంట సైనిక ఉపసంహరణ ప్రక్రియపై ఇరు దేశాలూ మరోసారి సమీక్షించాయి. దౌత్య, సైనిక స్థాయిలో సంప్రదింపులకు సంబంధించి మరో సమావేశాన్ని నిర్వహించేందుకు అంగీకరించాయి. అయితే ఈ సమావేశం ఎప్పుడు జరపాలనే దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు.

ఈ సమావేశానికి ముందు భారత్‌లో చైనా రాయబారి సన్‌ వీడాంగ్ మాట్లాడుతూ భారత్-చైనా విరోధులుగా కాకుండా భాగస్వామ దేశాలుగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జీరో-సమ్‌ గేమ్‌కు బదులుగా ఇద్దరు గెలవాలనే విన్‌-విన్‌ సహకారాన్ని కొనసాగించాలని కోరారు. ఒకరిపై ఒకరికి అనుమానంకంటే నమ్మకాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా ముందుకు సాగాలని కోరారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.