close

తాజా వార్తలు

Published : 12/07/2020 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘భారత్‌ను యావత్తు ప్రపంచం ప్రశంసిస్తోంది’

హోంమంత్రి అమిత్‌ షా

గురుగ్రామ్‌: కరోనాపై భారత్‌ చేస్తున్న పోరును యావత్తు ప్రపంచం ప్రశంసిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. కొవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో భద్రతా బలగాల కృషి మరువలేనిదన్నారు. గురుగ్రామ్‌లోని సీఆర్‌పీఎఫ్‌ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఆదివారం జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏపీఎఫ్‌ నేతృత్వంలో నేడు దేశవ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

‘‘అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటి. కొవిడ్ యుద్ధాన్ని భారత్‌ ఎలా ఎదుర్కొంటోందో అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ఈరోజు కరోనాపై మనం విజయవంతంగా చేస్తున్న యుద్ధాన్ని యావత్తు ప్రపంచం చూస్తోంది. ఈ పోరులో మన భద్రతా బలగాల కృషి ఎనలేనిది. కరోనా మెడలు వంచేందుకు పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ నా వందనం. ఉగ్రవాదుల పైనేగాక కరోనా వంటి మహమ్మారులపై కూడా ఎంత సమర్థంగా పోరాడగలమో నిరూపించారు. ఈ క్రమంలో కొంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారందిరికీ నేను నివాళులర్పిస్తున్నా. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొవిడ్‌-19పై చేస్తున్న పోరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆ చరిత్రలో జవాన్ల త్యాగం సువర్ణాక్షరాలతో లిఖిస్తారు’’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని