close

తాజా వార్తలు

‘వారి మరణమే నాకు ఓదార్పు’

ఉన్నావ్‌ మృతురాలి తండ్రి

లఖ్‌నవూ: ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మరణం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. దోషులకు వీలైనంత త్వరగా శిక్షపడేలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారికి మరణ శిక్షే సరైనదని ఆమె సోదరుడు అభిప్రాయపడ్డారు. ‘‘మా సోదరి ఇక మాతో లేదు. ఈ ఘోరానికి కారణమైన ఐదుగురి నిందితులకు మరణ శిక్ష విధించాలన్నదే నా ఏకైక డిమాండ్‌’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన బాధితురాలికి.. నేడు ఫోరెన్సిక్‌ నిపుణుల పర్యవేక్షణలో శవపరీక్ష నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. శుక్రవారం ఆమె తండ్రి మాట్లాడుతూ..‘‘నా కూతురు మరణానికి కారణమైన వారిని పోలీసులు కాల్చి చంపితేనే నాకు నిజమైన ఓదార్పు. నాకు ఆర్థిక సహాయంగానీ ఇరత ఎలాంటి సహకారం అసవరం లేదు. పోలీసులు వారిని పరిగెత్తించి కాల్చి చంపాలి. లేదా ఉరి తీయండి. మమ్మల్ని వారు రోజూ వేధిస్తూనే ఉన్నారు. ధనబలంతో మాకు న్యాయం జరగకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. వారిని ఎదిరించే ధైర్యం గ్రామంలో ఎవరికీ లేదు. పైగా వారి బెదిరింపులను ప్రజలే వచ్చి మాకు చెబుతున్నారు’’ అంటూ వాపోయారు. మరో సమీప బంధువుకు సైతం దోషుల కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.    

ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. బాధితురాలి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేశామని.. త్వరితగతిన విచారణ పూర్తి చేస్తామన్నారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. 

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన యువతి గత ఏడాది డిసెంబరులో అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో ఆమెను నమ్మించి మోసం చేసిన ఓ నిందితుడు అప్పట్లో అరెస్టై, గత నెల 25నే విడుదలయ్యాడు. అనంతరం మరికొందరితో కలిసి ఆమెను హత్య చేసేందుకు పన్నాగం పన్నాడు. అత్యాచార కేసు విచారణలో భాగంగా రాయ్‌బరేలీలోని కోర్టుకు హాజరయ్యేందుకుగాను గురువారం ఉదయం బాధితురాలు బయలుదేరగా.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై దాడి చేశారు. కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేది కూడా సజీవదహనానికి యత్నించినవారిలో ఉన్నారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం వాయుమార్గంలో గురువారం దిల్లీకి తరలించినా ఫలితం లేకపోయింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.