ట్రంప్‌ చివరి ప్రయత్నమూ విఫలం!

తాజా వార్తలు

Updated : 12/12/2020 12:44 IST

ట్రంప్‌ చివరి ప్రయత్నమూ విఫలం!

ఎన్నికల ఫలితాల నిలుపుదలకు సుప్రీం విముఖత

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసేందుకు విఫలయత్నం చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నాలుగు కీలక రాష్ట్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని.. అక్కడి ఎన్నికల ఫలితాల్ని నిలిపివేయాలంటూ టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌లో తనను కూడా చేర్చాలంటూ ట్రంప్‌ గురువారం కోర్టును కోరారు. రిపబ్లికన్ల వ్యాజ్యాల్ని కోర్టు తోసిపుచ్చడం ఈ వారం ఇది రెండోసారి కావడం గమనార్హం.

తాజా సుప్రీం కోర్టు తీర్పుతో ట్రంప్‌ ముందున్న అన్ని ద్వారాలూ మూసుకుపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశమై తదుపరి అధ్యక్షుణ్ని ఎన్నుకోనుంది. అన్నీ సజావుగా సాగితే జో బైడెన్‌ ఎంపిక లాంఛనమే. చివరి ప్రయత్నంగా టెక్సాస్‌ రిపబ్లికన్లు దాఖలు చేసిన వ్యాజ్యంలో 126 మంది రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు, 17 మంది అటార్నీ జనరళ్లు చేరారు. కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా,  మిషిగన్‌, విస్కాన్సిన్‌లో లక్షలాది ఓట్లను రద్దు చేయాలని కోరారు. కానీ, సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్‌ జరిగినట్లు ఆధారాలేమీ లేవని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి..

కరోనా అంతం దిశగా అమెరికా

అమెరికాకు మరో 100 మిలియన్‌ డోసుల టీకాAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని