మరో నాలుగేళ్లు ట్రంప్‌ అవసరముంది:పెన్స్‌

తాజా వార్తలు

Published : 24/10/2020 13:13 IST

మరో నాలుగేళ్లు ట్రంప్‌ అవసరముంది:పెన్స్‌

వాషింగ్టన్‌: మరో నాలుగేళ్లు అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉండాల్సిన అవసరం ఉందని ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్‌ పెన్స్ అన్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పెన్స్‌ మాట్లాడుతూ.. తొలివిడత అధికారంలో ట్రంప్ యంత్రాంగం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు చెపుకొచ్చారు. 

‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ శ్వేతసౌధంలో మరో నాలుగేళ్ల పాటు ఉండాల్సిన అవసరం పెన్విల్వేనియా, అమెరికాకు ఉంది. మళ్లీ మనం సంపన్నులమవుతామని మీరు నమ్ముతున్నారు. 2016లో ట్రంప్‌కు ‘అవును’ అని చెప్పారు. మరో నాలుగేళ్ల పాటు ఆయన అధ్యక్షుడిగా ఉండాలని పెన్సిల్వేనియా కోరుకుంటోంది. బైడెన్‌-హారిస్‌ ద్వయం ఈ దేశాన్ని సోషలిస్టు మార్గంలోకి తీసుకుపోతుంది. అది అమెరికాను వెనక్కి తీసుకుపోతుంది’ అంటూ ఆరోపణలు చేశారు. అలాగే జో బైడెన్‌ అధికారంలోకి వస్తే మధ్యతరగతి ప్రజలపై పన్నులు పెంచుతారని, ఉద్యోగాలు పోతాయంటూ విమర్శలు చేశారు. కానీ, గత మూడు సంవత్సరాల్లో ట్రంప్ పన్నులు తగ్గించి, లక్షల కొద్ది ఉద్యోగాలను సృష్టించారని చెప్పుకొచ్చారు. మీకు ఉద్యోగాల సృష్టికర్త కావాలో లేక ఉద్యోగాలను విదేశాలకు తరలించే వ్యక్తి కావాలో తేల్చుకోవాలన్నారు. 

కాగా, అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా నిర్ణయం కీలకంగా మారుతుంది. తాజా అభిప్రాయ సేకరణలో ఈ రాష్ట్రంలో బైడెన్‌ ఐదు శాతం ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది. అయితే, కొద్ది రోజులుగా ఆ అంతరం తగ్గుతుండటం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని