
తాజా వార్తలు
మనసును కదిలిస్తోన్న ..కరోనా చిత్రం
కొవిడ్ రోగిని హత్తుకున్న వైద్యుడు..
వాషింగ్టన్: ఈ కరోనా సంక్షోభ సమయంలో ఓ వైద్యుడు, రోగి మధ్య చోటుచేసుకున్న సన్నివేశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎదురుగా కొవిడ్ రోగి కన్నీరుపెట్టుకుంటుంటే చలించిన వైద్యుడు.. తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఆత్మీయంగా హత్తుకునే దృశ్యం నెటిజన్లను మెప్పించింది. ఇంతకీ విషయం ఏంటంటే..
జోసెఫ్ వరోన్..హూస్టన్‌లో యూనైటెడ్ మెమోరియల్ సెంటర్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్. అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోన్న తరుణంలో 250 రోజులకు పైగా విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు తీవ్ర కలవరపాటుతో ఉండటం ఆయన కంటపడింది. ఆ బాధితుడు బెడ్ దిగి, గది నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్థమైంది. మరోపక్క కళ్ల వెంట కన్నీరు కారుతోంది. దీన్నంతా గమనించిన జోసెఫ్ వెంటనే ఆ రోగి వద్దకు వెళ్లి..‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు?’ అని ప్రశ్నించగా..‘నాకు నా భార్యతో ఉండాలని ఉంది’ అంటూ ఒక్కసారిగా బోరుమన్నాడు ఆ బక్కపల్చని వ్యక్తి. తన భార్యతో అనుబంధానికి నెరిసిన వెంట్రుకలే సాక్ష్యంగా నిలిచాయి. కరోనాతో తాను మరణిస్తే తన భాగస్వామి పరిస్థితి ఏంటనే ఆవేదన ఆ కన్నీరే చెప్తోంది.
తన ఎదుట ఉంది కొవిడ్ రోగి అనే వాస్తవాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టి, ఓదార్పు నివ్వాలనుకున్నాడు ఈ వైద్యుడు. వెంటనే అతడిని దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. ‘అతడిని చూస్తే చాలా బాధేసింది. అతడు పడుతున్న ఆవేదనే నాకు కలిగింది’ అంటూ జోసెఫ్ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో తీసిన చిత్రమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను కదిలిస్తోంది.
అతడు ఏడుస్తుంటే..నాకెందుకు కన్నీరు వచ్చిందో..
కాగా, అ వృద్ధుడి గురించి, అమెరికాలో కరోనా సంక్షోభం గురించి వొరాన్ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొద్దిసేపటి తరవాత ఆ వ్యక్తి కాస్త కుదుటపడ్డాడని, ఏడుపు ఆపేశారని వెల్లడించారు. ‘అసలు నేను ఎందుకు కన్నీరు పెట్టుకున్నానో తెలీదు. మా నర్సులు కూడా ఉద్వేగానికి గురయ్యారు’ అని ఆ హృదయవిదారక సన్నివేశంపై స్పందించారు. కొవిడ్ యూనిట్స్‌లో ఐసోలేషన్‌లో గడపడం చాలా కష్టంగా ఉంటుందని, వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీరొక గదిలో ఉండి, మీ దగ్గరకు పీపీఈ కిట్లతో కొందరు వ్యక్తులు వస్తుంటే మీ పరిస్థితి ఎలా ఉటుందో ఊహించుకోండి’ అని బాధితులు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను వివరించారు. ‘మీరు వయసు మళ్లినవారైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొందరు ఏడుస్తారు. కొందరు ఇక్కడి నుంచి తప్పించుకు పోవాలని చూస్తారు. కిటికీ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన వారూ ఉన్నారు. ఈ పెద్దాయన కాస్త నయం. ఈ వారాంతంలో ఈయనకు నయమవుతుందని ఆశిస్తున్నాను’ అని జోసెఫ్ మీడియాకు వెల్లడించారు.
‘నాలాగా మీరు కొవిడ్ బాధితులను కౌగిలించుకోవాలని నేను భావించట్లేదు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, ఒక దగ్గర గుమిగూడకుండా ఉండటం..ఇలాంటి నిబంధనలు పాటిస్తే చాలు. మీరు వాటిని పాటిస్తే, నాలాంటి వైద్య సిబ్బంది కాస్త విరామం తీసుకుంటారు’ అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
