close

తాజా వార్తలు

Updated : 02/12/2020 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫైజర్‌ టీకాకు యూకే అనుమతి మంజూరు..! 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ తయారు చేసిన కొవిడ్‌ టీకాకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఫైజర్‌ టీకాకు అనుమతి మంజూరు చేసిన తొలిదేశంగా నిలిచింది. దీనిపై ఫైజర్‌ స్పందిస్తూ తక్షణమే తమ వద్ద ఉన్న వాటిని యూకేకు తరిలించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు పేర్కొంది. దీనిని వచ్చే వారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.

‘‘ది ఇండిపెండెంట్‌ మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ సూచనల మేరకు ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కొవిడ్‌ టీకా వినియోగానికి ప్రభుత్వం నేడు ఆమోదముద్ర వేసింది. వచ్చేవారం నుంచి టీకా అందుబాటులోకి వస్తుంది’’ అని బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై హెల్త్‌ సెక్రటరీ మాట్‌ హాంకాక్‌ స్పందిస్తూ ‘ఇది చాలా మంచి వార్త. వచ్చేవారం నుంచి వ్యాక్సినేషన్‌ మొదలు కానుంది’ అని  పేర్కొన్నారు. ఫైజర్‌ సీఈవో ఆల్‌బర్ట్‌ బౌర్లా స్పందిస్తూ‘‘ఇది చారిత్రక నిర్ణయం. మేమే ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన టీకాలను సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నాం’’ అని పేర్కొన్నారు.

ఇప్పటికే యూకే దాదాపు రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేయడానికి అవసరమైన టీకాలను ఆర్డర్‌ చేసింది. ఈ ఏడాది చివరికి ఎన్నిటీకాలు సరఫరా అవుతాయో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. మూడు వారాల వ్యవధిలో రెండు టీకాలు వేయించుకొంటే పూర్తి రక్షణ లభిస్తుంది.

 

ఫైజర్‌ టీకా రవాణాకు అనుమతి



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని