నైజీరియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్‌!

తాజా వార్తలు

Published : 14/12/2020 09:30 IST

నైజీరియాలో ఇద్దరు భారతీయుల కిడ్నాప్‌!

నైజీరియా: ఆఫ్రికా దేశమైన నైజీరియాలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులను అక్కడి సాయుధ ముఠాలు కిడ్నాప్‌ చేశాయి. దీంతో దేశంలోని విదేశీ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఓ ఔషధ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు తమ పని ముగించుకొని బయటకు వస్తుండగా.. సాయుధులైన దుండగులు వారిని అపహరించుకొని వెళ్లిపోయారు. వారిని గుర్తించేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నైజీరియాలో ఉంటున్న విదేశీయులంతా అప్రమత్తంగా ఉండాలని.. ఏవైనా అనుమానికత కదలికలు ఉంటే వెంటనే భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. నైజీరియాలో ఔషధ పరిశ్రమల్లో వందలాది మంది భారతీయులు పనిచేస్తుంటారు. విదేశీయులను కిడ్నాప్‌ చేసి భారీగా డబ్బు డిమాండ్‌ చేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది. డబ్బు అందగానే వారికి ఎలాంటి హాని జరగకుండా వదిలిపెడుతుంటారు.

ఇవీ చదవండి..
కరోనాతో ఎస్వాతీనీ దేశ ప్రధాని మృతి

ఎంత అమానుషం..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని