ట్రంప్‌నకు కరోనా.. ప్రచారం సంగతేంటి?

తాజా వార్తలు

Published : 04/10/2020 01:26 IST

ట్రంప్‌నకు కరోనా.. ప్రచారం సంగతేంటి?

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉండగా డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తొలుత అధికార నివాసం వైట్‌హౌస్‌లోనే ఉంటారన్న ట్రంప్‌.. వైద్యనిపుణుల సూచనల మేరకు ప్రస్తుతం వాషింగ్టన్‌లోని వాల్డర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో పాల్గొన్న ట్రంప్‌.. ఎన్నికలలోగా మరో రెండు చర్చాగోష్ఠి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితిలో ప్రచార కార్యక్రమాలను వాయిదా వేయటం లేదా వర్చువల్‌గా నిర్వహించటం అనే రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయని ఆయన ప్రచార నిర్వాహకుడు బిల్‌ స్టెపియన్‌ వెల్లడించారు.

‘‘అధ్యక్షుడు ట్రంప్‌ పాల్గొనాల్సిన అన్ని ప్రచార కార్యక్రమాలను వర్చువల్‌ రూపంలోకి మార్చే ఏర్పాటు కొనసాగుతోంది. ఆ విధంగా చేయటం సాధ్యం కాకపోతే వాయిదా వేస్తాం. అంతేకాకుండా అధ్యక్షుడి కుటుంబ సభ్యులు భాగం కావాల్సిన కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి’’ అని స్టెపియన్‌ వివరించారు. కాగా, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రచార కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా కీలకమైన ఈ దశలో ట్రంప్‌ అందుబాటులో లేకపోతే ఆయన విజయావకాశాలపై నీలినీడలు కమ్ముకున్నట్లే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరో వైపు ఎన్నికలు జరిగే నవంబర్‌ 3లోగా ట్రంప్‌ కరోనా నుంచి కోలుకుంటే ఆయన ఈ కొవిడ్‌ విపత్కర పరిస్థితిలో ఆశావాదానికి చిహ్నంగా నిలవచ్చని..  నయం కానట్లయితే సానుభూతితో గెలిచే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని