పోలింగ్‌ ముగిసిన వెంటనే న్యాయపోరాటం: ట్రంప్‌

తాజా వార్తలు

Published : 02/11/2020 17:25 IST

పోలింగ్‌ ముగిసిన వెంటనే న్యాయపోరాటం: ట్రంప్‌

వాషింగ్టన్‌: నవంబరు 3న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే తనకు తాను ముందుగానే విజేతగా ప్రకటించుకుంటారని వస్తున్న వార్తల్ని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఖండించారు. అయితే, అదే రోజు న్యాయపోరాటానికి మాత్రం సిద్ధమవుతున్నట్లు సంకేతాలిచ్చారు.

పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చే బ్యాలెట్‌ పత్రాలను అనుమింతించొచ్చన్న సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై వెంటనే తమ న్యాయవాదులతో కలిసి ఎన్నికలు ముగిసిన రాత్రే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. దీనివల్ల ఎన్నికల కౌంటింగ్‌ అవకతవకలు జరిగే అవకాశం ఉందన్నారు. అత్యాధునిక కంప్యూటర్‌ యుగం నడుస్తున్న రోజుల్లో పోలింగ్ ముగిసిన రోజే ఫలితాల్ని ప్రకటించలేకపోవడం చాలా దారుణమైన విషయమన్నారు. ప్రపంచమంతా ఫలితాల కోసం వేచి చూస్తుంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బ్యాలెట్లు వేసేందుకు ఇంకా అనుమతించడం ప్రమాదకరమైన అంశమన్నారు. 

అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీకి భారీ మద్దతు లభిస్తోందన్నారు. ఫ్లోరిడా, ఒహైయో, జార్జియా, నార్త్‌ కారోలినా, మిషిగాన్‌ రాష్ట్రాల్లో తమ పార్టీయే ముందుందన్నారు. ఒహైయోలో 2016 కంటే కూడా మెరుగైన ఫలితాలు రానున్నాయని జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా తమ పార్టీ హవా కొనసాగుతోందన్నారు. 

కొన్ని రాష్ట్రాల్లో మెయిల్‌-ఇన్ పద్ధతితో నమోదైన బ్యాలెట్లు మూడు రోజుల వరకు స్వీకరించేలా సుప్రీంకోర్టు ఆదేశించింది. పెన్సిల్వేనియా, నెవాడా నుంచి మూడు రోజులు, నార్త్‌ కారోలినా నుంచి తొమ్మిది రోజుల వరకు వచ్చే బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. అదే విస్కాన్‌సిన్‌లో మాత్రం పోలింగ్‌ రోజుకే పరిమితం చేసింది. దీన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. నెల క్రితం నుంచే మెయిల్‌-ఇన్‌ ద్వారా ఓటు వేసే అవకాశం ఉన్నప్పుడు పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్లను అనుమతించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని