బుడతడు.. ఒబామానే అడ్డుకున్నాడు!

తాజా వార్తలు

Published : 03/11/2020 11:22 IST

బుడతడు.. ఒబామానే అడ్డుకున్నాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు దఫాలు దేశాధ్యక్షుడిగా పనిచేసిన వారి నుంచి మనకు ఫోన్‌ కాల్‌ వస్తే ఎలా ఉంటుంది.. గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంటుంది. అలాంటిది అంత గొప్ప వ్యక్తి మాటలకు నెలల వయస్సు ఉన్న ఓ చిన్నారి ఆటంకం కలిగించిన ఘటన ఇటీవల అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలను చేరుకునేందుకు ఆయన అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అందరికీ సురక్షితంగా ఉండేలా ఫోన్‌ కాల్స్‌ ద్వారా కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఓ సరదా ఘటనను ఒబామా  సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఒబామా తన ఫోన్‌ ప్రచారాన్ని ‘ఫోన్‌ బ్యాంకింగ్‌’ అని చెపుతూ .. అలీస్సా అనే మహిళతో మాట్లాడారు. దీంతో ఒక్కసారి షాక్‌కు గురైన ఆమె.. తనకు ఆనందంతో గుండెపోటు వచ్చేలా ఉందన్నారు. అంతేకాకుండా బైడెన్‌, కమల హారిస్‌లకే తన ఓటని కూడా స్పష్టం చేశారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన ఒబామా.. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా బైడెన్‌కే ఓటు వేసేలా చూడాలని కోరారు.
ఇంతలో ఆయన మాటలకు అలీస్సా ఎనిమిది నెలల కుమారుడు జాక్సన్‌ అడ్డు పడ్డాడు. దీంతో ఆ చిన్నారి ఆకలిగా ఉన్నాడా, బట్టలు తడుపుకొన్నాడా, తల్లి కోసం మారాం చేస్తున్నాడా అని ఒబామా ఆ మహిళను అడిగి తెలుసుకున్నారు. తాను ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడినా చిన్నారి జాక్సన్‌ ఇదే విధంగా అడ్డుకుంటాడని ఆమె వివరించారు. కాగా, ఆ చిన్నారిని పలకరించిన మాజీ అధ్యక్షుడు.. ఈ వయసులో ఫోన్‌లో మాట్లాడకూడదని.. అతను పెద్దయ్యాక తాను చాలా సేపు మాట్లాడతానని సరదాగా జవాబిచ్చారు.

కాగా, ఏ మాత్రం హోదా, దర్పం లేకుండా ఒబామా ఆ చిన్నారిని పలకరించి, మాట్లాడిన తీరు నెటిజన్లను అబ్బురపరచింది. నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియో మీరూ చూడండి మరి!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని