China heightens activity at LAC: సరిహద్దుల్లో చైనా గస్తీ ముమ్మరం

తాజా వార్తలు

Updated : 22/07/2021 16:00 IST

China heightens activity at LAC: సరిహద్దుల్లో చైనా గస్తీ ముమ్మరం

వాస్తవాధీన రేఖ వద్ద పీఎల్‌ఏ సైనికుల పెట్రోలింగ్‌
అప్రమత్తమైన భారత సైన్యం

దిల్లీ: ఉత్తరాఖండ్‌లోని వాస్తవాధీన రేఖ వద్దనున్న సరిహద్దుల్లో చైనా దూకుడు పెంచింది. ఇక్కడి బరాహోతి సమీపంలో ఆ దేశానికి చెందిన 40 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులు ముమ్మరంగా గస్తీలో పాల్గొంటున్నారు. సుమారు 6 నెలల తర్వాత చైనా తన సరిహద్దు భూభాగంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్టు భారత అధికారులు ధ్రువీకరించారు. తాజా పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి సవాలునైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లద్దాఖ్‌లో ఉభయ దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఈ ప్రాంతంలో చోటుచేసుకోకూడదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సెంట్రల్‌ సెక్టారుకు అదనపు దళాలను మోహరించామన్నారు.

* బారాహోతి సమీపంలోని తన వైమానిక స్థావరం వద్ద కూడా చైనా కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఇక్కడి నుంచి ఆ దేశం హెలికాఫ్టర్లు, డ్రోన్లతో కార్యకలాపాలు చేపడుతోంది. అత్యంత సున్నితమైన వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనాలు సుమారు చెరో 60 వేల ట్రూపుల సైన్యాన్ని మోహరించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని