లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: గుడి బయటే ఒక్కటైన జంట 
close

తాజా వార్తలు

Published : 31/03/2020 01:42 IST

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: గుడి బయటే ఒక్కటైన జంట 

మదురై: కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న వివాహాలు, ఇతర కార్యక్రమాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు. దేవాలయాలు, ఇతర ప్రార్థనా ప్రదేశాలతో సహా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాలు 21 రోజలు పాటు మూసివేశారు. ఈ నేపథ్యంలో కొందరు తమ వివాహాలను దేవుడి సన్నిధిలో జరుపుకోవాలనే ఉద్దేశంతో గుడి ముందు బంధువుల సమక్షంలో ఒక్కటవుతున్నారు. తాజాగా మదురైకి చెందిన వధూవరులు తమ వివాహాన్ని తిరుపురుకుండ్రంలోని మురుగన్‌ గుళ్లో జరిపించుకోవాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గుడి మూసివేయడంతో, గుడి తలుపులు ముందు బంధువుల సమక్షంలో వధువు మెళ్లో వరుడు తాళి కట్టాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు తమిళనాడులో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 1071 కరోనా బారిన పడ్డారు. వీరిలో 99 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని