మారితే.. చైనా ఎందుకవుతుంది?

తాజా వార్తలు

Published : 24/08/2020 00:39 IST

మారితే.. చైనా ఎందుకవుతుంది?

దక్షిణ చైనా సముద్రంలో బాంబర్‌ విమానాల మోహరింపు

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: దుందుడుకు చైనా మరోసారి తెంపరితనం చూపించింది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లో బాంబర్‌ విమానాలను మోహరించింది. అక్కడి ప్రశాంత పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చింది. భారత్‌లో వియత్నాం రాయబారి ఫామ్‌ సన్‌ చౌ ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. భారత్‌, వియత్నాం మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం అవసరమని నొక్కిచెప్పారు.

చాలా కాలంగా దక్షిణ చైనా సముద్రంలోని పరాసల్‌‌ దీవులపై వివాదం నెలకొంది. అవి తమ ప్రాదేశిక ప్రాంతంలోనివే అని వియత్నాంను చైనా బెదిరిస్తోంది. కాగా వియత్నాంకు మద్దతుగా అమెరికా అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో అక్కడి పెద్దదైన వుడీ దీవిలో హెచ్‌-6జే బాంబర్‌ను చైనా ఈ నెలంతా మోహరిస్తుందని వార్తలు వచ్చాయి. అది యూఎస్‌ యుద్ధ విమానాల ప్రభావాన్ని తగ్గించగలదని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

చైనా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని వియత్నాం భారత్‌కు తెలిపింది. ఆ ప్రాంతంలో పరిస్థితులను డ్రాగన్‌ ఉద్రిక్తంగా మార్చిందని వెల్లడించింది. మన రెండు దేశాల మధ్య వ్యూహత్మర రక్షణ సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకోవాలని కోరింది.

డ్రాగన్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ దక్షిణ చైనా సముద్రం తీరంలో చమురు, సహజవాయు నిక్షేపాలను అన్వేషించేందుకు భారత్‌ సహకారం కోరింది. కాగా తమ వద్ద గస్తీ పడవలు కొనుగోలు చేసేందుకు వియత్నాంకు భారత్‌ 100 మిలియన్‌ డాలర్లు రుణం ఇచ్చింది. ఇంకా రక్షణ సామగ్రిని కొనుగోలు చేసేందుకు మరో 500 మిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని