close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/07/2020 11:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ షాక్‌!

ట్రంప్‌ సర్కార్‌ మరో అనూహ్య నిర్ణయం

వాషింగ్టన్‌: ఇప్పటికే హెచ్‌-1బీ వంటి పలు వీసాలు, గ్రీన్‌కార్డుల జారీపై నిషేధం విధించిన అమెరికా ప్రభుత్వం మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది.  విదేశీ విద్యార్థులకు భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైనట్లయితే విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ప్రకటించింది. అలాగే  కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో  ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోం. అలాంటి వారిని దేశంలోకి అనుమతింబోం. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఎఫ్‌-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నవారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా ఉండాలనుకుంటే భౌతికంగా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్న విద్యా సంస్థలకు బదిలీ చేసుకోవాలి’’ అని ఐసీఈ తన ప్రకటనలో పేర్కొంది. లేదంటే ఇమ్మిగ్రేషన్‌ శాఖ తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. రెండు మాధ్యమాల ద్వారా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు.. ఎక్కవ మంది విద్యార్థులు భౌతికంగా హాజరవుతున్నారని నిరూపించకోవాల్సి ఉంటుందని తెలిపింది. 

ట్రంప్‌ ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) గణాంకాల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో అమెరికాలో దాదాపు 10 లక్షల మందిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరి ద్వారా 2018 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు 44.7 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది.  ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లేవారిలో అత్యధికులు చైనా, భారత్‌, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడాకు చెందినవారే.  ట్రంప్‌ తాజా నిర్ణయంతో అక్కడి విద్యాసంస్థలన్నీ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.  

ట్రంప్‌ తాజా నిర్ణయంపై ప్రతిపక్ష డెమొక్రాటిక్‌ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. విద్యాసంస్థలు కచ్చితంగా తెరవాలని ఆదేశిస్తున్న ట్రంప్‌ మూర్ఖపు నిర్ణయం వల్ల లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలోకి జారే అవకాశం ఉందని వాపోయారు. ‘‘వైట్‌ హౌస్‌లో ఉన్న ప్రస్తుత పాలనా యంత్రాంగ క్రూరత్వానికి హద్దులే లేకుండా పోతున్నాయి’’ అని ఇటీవల అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ అన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.