సౌదీ రాజుకు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక!

తాజా వార్తలు

Published : 21/07/2020 01:54 IST

సౌదీ రాజుకు అస్వస్థత, ఆసుపత్రిలో చేరిక!

రియాద్‌: సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో 84ఏళ్ల సల్మాన్‌ బిన్‌ను వైద్యపరీక్షల కోసం రియాద్‌లోని ఆసుపత్రికి తరలించారని అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిచేసే సౌదీ అరేబీయాకు 2015నుంచి సల్మాన్‌ బిన్‌ రాజుగా కొనసాగుతున్నారు. 50ఏళ్లపాటు రియాద్‌ గవర్నర్‌గా ఉన్న సల్మాన్‌.. రాజు కావడానికి ముందు రెండున్నర సంవత్సరాలు సౌదీ యువరాజుగా, డిప్యూటీ ప్రీమియర్‌గా ఉన్నారు.

రాజు పీఠానికి తర్వాతి వరుసలో ఉన్న యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌(ఎంబీఎస్‌)కు సౌదీలోని యువరాజులందరికంటే మంచి పేరుంది. ఎంబీఎస్‌గా సుపరిచితుడైన 34 ఏళ్ల మహమ్మద్‌ బిన్ రాజ్యంలో ఆర్థిక సంస్కరణలకు కృషి చేస్తున్నారు. వీటితో పాటు ముస్లిం మహిళలపై ఉన్న ఆంక్షలను సడలించడం, వారికి మరిన్ని హక్కులు కల్పించడం వంటి చర్యలతో ఎంబీఎస్‌ దేశప్రజల మన్ననలను చూరగొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని