దిల్లీ కాలుష్యానికి ఆ సీఎంలదే బాధ్యత: అతిషి

తాజా వార్తలు

Published : 19/11/2020 02:03 IST

దిల్లీ కాలుష్యానికి ఆ సీఎంలదే బాధ్యత: అతిషి

దిల్లీ: దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం పెరగడానికి హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులదే ప్రత్యక్ష బాధ్యత అని ఆప్‌ నేత, ఎమ్మెల్యే అతిషి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆమె కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ కంట్రోల్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. గత నెలన్నర కాలంగా పంట వ్యర్థాలను కాల్చడంతో దిల్లీ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు.  నేరపూరిత నిర్లక్షంతో వ్యవహరిస్తూ దిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్న ఆ ఇద్దరు ముఖ్యమంత్రులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కమిషన్‌తో పాటు సుప్రీం కోర్టు కూడా ఈ అంశాన్ని సుమోటోగా విచారణ చేపట్టాలని ఆప్‌ అప్పీల్‌ చేయాలనుకుంటోందని తెలిపారు. ఉత్తర భారత దేశ ప్రజా ఆరోగ్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉంచుతున్న ఆ రెండు రాష్ట్రాల సీఎంలపై చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని దిల్లీలో కాలుష్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని