close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120072752 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/2551449408499685 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/2551449408499685 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-06-06 19:07:21.215704 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 07/06/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మొన్న ఏనుగు.. నేడు ఆవు

బిలాస్‌పూర్‌: పేలుడు పదార్థాలు కలిగిన పండును తిని ఆ బాధతో ఏనుగు మరణించిన ఘటన మరువక ముందే హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈసారి ఆవు ఆ దారుణ పరిస్థితిని ఎదుర్కొంది. బిలాస్‌పూర్‌లోని జన్‌దుత ప్రాంతంలో ఓ గర్భంతో ఉన్న ఆవు దవడ పగిలిపోయి రక్తమోడుతూ వీధుల్లో తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

దీంతో ఆ ఆవు యజమాని గురుదయాళ్‌ సింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. తన ఇంటి పక్కన ఉండే నందలాల్‌ కావాలనే ఇలా చేశాడని ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన వెంటనే నందలాల్‌ తన ఇంటి నుంచి పరారయ్యాడు. 10రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆవు యజమాని గురుదయాళ్‌ ఫిర్యాదు మేరకు జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.