క్షీణిస్తోన్న ప్రణబ్‌ ఆరోగ్యం..!

తాజా వార్తలు

Published : 26/08/2020 12:09 IST

క్షీణిస్తోన్న ప్రణబ్‌ ఆరోగ్యం..!

దిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం క్షీణిస్తోందని దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఉపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ఆయనకు నిన్నటినుంచి కిడ్నీ సంబంధ సమస్యలు కూడా ఎదురౌతున్నట్లు తాజా బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం కోమాలో ఉన్న ప్రణబ్‌ ముఖర్జీకి వెంటిలేటర్‌ సహాయంతోనే చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆసుప్రతి ప్రకటించింది. 

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10వ తేదీన ప్రణబ్‌ ముఖర్జీ దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతరం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యబృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని